Posts

శ్రీబాగ్ ఒడంబడిక అమలు | SRI BAGH PACT FOR IMPLEMENTATION

  శ్రీబాగ్ ఒడంబడిక శ్రీబాగ్ ఒడంబడిక అమలులో పాలకుల వైఫల్యాలకు నిరసనగా నవంబర్ 16 2021 న నిర్వహిస్తున్న రాయలసీమ సత్యాగ్రహం విజయవంతం చేయండి. వేదిక :-  గాంధీ చౌక్, నంద్యాల మరియు రాయలసీమలోని వివిధ రెవిన్యూ కేంద్రాలలో తేది,సమయం :-   నవంబర్ 16, 2021 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు నవంబర్ 16 నే రాయలసీమ సత్యగ్రహం ఎందుకు ? రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక నవంబర్ 16, 1937 జరిగింది. కానీ హక్కుల పత్రంలోని ఏ అంశాలను కూడా పాలకులు అమలు పరచలేదు.అందుకే రాయలసీమ హక్కుల పత్రంలోని అంశాలను అమలు చేయమని శ్రీబాగ్ ఒడంబడిక జరిగిన నవంబర్ 16న గత నాలుగు సంవత్సరాలుగా రాయలసీమ ప్రజా సంఘాలు సత్యాగ్రహం నిర్వహిస్తున్నాయి .  శ్రీ బాగ్ ఒడంబడిక ఎందుకు జరిగింది ? ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక  ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మొదలయ్యింది. ఈ ఉద్యమంలో తొలి విజయంగా తెలుగు ప్రాంతంలో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం అనుమతించింది. రాయలసీమలో ఏర్పాటు కావాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్టణం లో  ఏర్పాటు చేయడంతో రాయలసీమ ప్రజలకు కోస్తా నాయకత్వంపై నమ్మకం తగ్గింది. దీ

Amrita sentences about spousal attachment | భార్యాభర్తల అనుబంధం | Spousal affiliation

Image
  భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు   👉నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.🌷🌷 👉తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.🌼🌼 👉అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.🌻🌻 👉అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే.🌺🌺 👉సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.🌸🌸 👉ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడెమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.💮💮 👉భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.🏵🏵 👉ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!🕊🕊 👉అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.🐦🐦 👉మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్

Rayalaseema Satyagraham | రాయలసీమ సత్యాగ్రహం

  రాయలసీమ సత్యాగ్రహం నవంబర్ 16, 2021 ------------------------------- రాయలసీమ అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుకై 2008 నుండి ప్రతి సంవత్సరం  రాయలసీమ‌ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున సత్యాగ్రహం నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం నిర్వహించాల్సిన సత్యాగ్రహం పై ప్రజా సంఘాల సలహాలను, సూచనలను ఆహ్వానిస్తు జులై 25, 2021 న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఉత్తరం వ్రాయడమైనది.  రాయలసీమ సత్యాగ్రహం -2021  రాయలసీమలోని జిల్లా కేంద్రాలు మరియు ప్రధాన రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలని సూచనలు ప్రధానంగా వచ్చాయి. రాయలసీమ సత్యాగ్రహం ఉదయం 10 గంటలనుండి సాయింత్రం 4 గంటల వరకు నిర్వహించాలని సూచనలు వచ్చాయి. అదే సందర్భంలో ఏదైనా ఒక రాయలసీమ కేంద్రంలో కేంద్రీకృతంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచనలు కూడా వచ్చాయి. కోవిడ్ -19 ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నందున కేంద్రీకృతంగా కాకుండా రాయలసీమ జిల్లాల్లో వివిధ కేంద్రాలలో  రాయలసీమ ప్రాజెక్టుల ప్రాధాన్యత, శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో రాజధాని/హైకోర్టు, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణకై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమంగా రాయలసీమ సత్యాగ్రహం - 2021 నిర్

తాలిబన్ల మితిమీరిన జోక్యం | Excessive Taliban intervention | Warning to com Air‌

Image
  తాలిబన్ల మితిమీరిన జోక్యం   మితిమీరిన జోక్యం  కారణం చేత గురువారం నుంచి అఫ్గాన్‌ రాజధాని అయిన కాబుల్‌కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీ.ఐ.ఏ) ప్రకటించింది. అక్కడ టికెట్ల ధరలను తగ్గించాలని, లేనిపోతే సేవలను నిలిపివేస్తామని తాలిబన్లు ఇటీవల పీ.ఐ.ఏ తోపాటు స్థానిక విమానయాన సంస్థ ‘కామ్ ఎయిర్‌’ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  ప్రస్తుతం పీ.ఐ.ఏ లో కాబుల్‌ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్‌ ధర 2,500 డాలర్ల వరకు ఉంటుంది. అంతకుమునుపు కేవలం 120 నుండి 150 డాలర్ల మధ్యే ఉండేది. కానీ ఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమైన తర్వాత ఇక్కడి నుంచి రెగ్యులర్‌గా సర్వీసులు నడుపుతున్న ఏకైక అంతర్జాతీయ విమాన సంస్థ ఇదే.  ప్రస్తుతం పీ.ఐ.ఏ కాబుల్‌కు ఛార్టర్డ్‌ విమానాలు నడుపుతోంది. తాజాగా సర్వీసుల నిలిపివేతపై స్పందిస్తూ ‘మానవతా దృక్పథంతో అఫ్గాన్‌కు విమానాలు నడుపుతున్నాం.  బీమా సంస్థలు కాబుల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున, బీమా ప్రీమియం ధరలు భారీగా ఉన్నాయి. ఈ ప్రభావం టికెట్లపై పడుతోంది’ అని వివరించడం జరిగింది. మరోవైపు తాలిబన్లు సైతం చివరి నిమిషంలో ప్

ARKE | మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) | Akkiraju the top Maoist leader

Image
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ "ఆర్కే" అనారోగ్యంతో కన్నుమూత.!! ఆర్కే : ప్రస్తుతం ఇతను మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కానీ దక్షిణ బస్తర్‌ అడవుల్లో ని 'మాడ్‌' అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధ్రువీకరించలేదు. దేశ వ్యాప్తంగా ఆర్కేపై కేసులున్నాయి. అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. బలిమెల ఎన్‌కౌంటర్‌ నుంచి  ఆర్కే తృటిలో తప్పించుకోగా ఈఘటన లో ఆయనకు బుల్లెట్‌ గాయమైంది.  2004 అక్టోబరు 15న అప్పటి సీ.ఎం.వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్కే నేతృత్వంలోనే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై రూ.50 లక్షల రివార్డును కూడ  పోలీసుశాఖ ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ లో జరిగిన ఎదురు కాల్పుల్లో పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నారు.  వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆర్కే దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆర్కే మృతి మావోయిస్టు పార్టీకి  పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మారుమూల కుగ్రామం తుమృకోట. బడి పంతులు

చీకటి భారత్ | Dark India | Public Talk News

Image
 చీకటి భారతం ! ( DARK INDIA.!) మోడీ ప్రభుత్వ ముదనష్టపు విధానాల ఫలితంగా దేశంలో చిమ్మచీకట్లు అలముకుంటున్నాయి. బొగ్గు సరఫరాలో కొరత వల్ల ఆంధ్రప్రదేశ్‌తో బాటు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, బీహార్‌, జార్ఖండ్‌, తమిళనాడు, వంటి రాష్ట్రాలు అంధకారం అంచుల్లో ఉన్నాయి. కరెంటు కోతలు అనివార్యమన్న సంకేతాలు అవి ఇప్పటికే ఇచ్చాయి. బొగ్గు కొరత వల్ల మన రాష్ట్రంలో జెన్‌కో ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడపలేని స్థితి నెలకొంది. రాష్ట్ర అవసరాలకు అవసరమైన విద్యుత్‌లో45 శాతం వరకు ఈ థర్మల్‌ ప్లాంట్ల నుంచే ఉత్పత్తి అవుతున్నది. బొగ్గు సరఫరా లేక ఇవి ఆగిపోతే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు అంధకారమవుతుంది. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. బొగ్గు కొరత వల్ల యు.పి లో 14 బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయిదు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను పూర్తిగా మూసేశారు. రాజస్థాన్‌లో రోజుకు గంట చొప్పున కరెంటు కోత పెట్టారు. లోడ్‌ షెడ్డింగ్‌ పేరుతో పంజాబ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు కోతలకు సిద్ధమవుతున్నాయి.  ముసురుకొస్తున్న ఈ సంక్షోభం ఇంకొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశముంది. బొగ్గు నిక్షేపాల్ల