చీకటి భారత్ | Dark India | Public Talk News
చీకటి భారతం ! ( DARK INDIA.!) మోడీ ప్రభుత్వ ముదనష్టపు విధానాల ఫలితంగా దేశంలో చిమ్మచీకట్లు అలముకుంటున్నాయి. బొగ్గు సరఫరాలో కొరత వల్ల ఆంధ్రప్రదేశ్‌తో బాటు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, వంటి రాష్ట్రాలు అంధకారం అంచుల్లో ఉన్నాయి. కరెంటు కోతలు అనివార్యమన్న సంకేతాలు అవి ఇప్పటికే ఇచ్చాయి. బొగ్గు కొరత వల్ల మన రాష్ట్రంలో జెన్‌కో ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడపలేని స్థితి నెలకొంది. రాష్ట్ర అవసరాలకు అవసరమైన విద్యుత్‌లో45 శాతం వరకు ఈ థర్మల్ ప్లాంట్ల నుంచే ఉత్పత్తి అవుతున్నది. బొగ్గు సరఫరా లేక ఇవి ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమవుతుంది. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. బొగ్గు కొరత వల్ల యు.పి లో 14 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయిదు థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా మూసేశారు. రాజస్థాన్‌లో రోజుకు గంట చొప్పున కరెంటు కోత పెట్టారు. లోడ్ షెడ్డింగ్ పేరుతో పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు కోతలకు సిద్ధమవుతున్నాయి. ముసురుకొస్తున్న ఈ సంక్షోభం ఇంకొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశముంది. బొగ్గు ని...