తాలిబన్ల మితిమీరిన జోక్యం | Excessive Taliban intervention | Warning to com Air
తాలిబన్ల మితిమీరిన జోక్యం మితిమీరిన జోక్యం కారణం చేత గురువారం నుంచి అఫ్గాన్ రాజధాని అయిన కాబుల్‌కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీ.ఐ.ఏ) ప్రకటించింది. అక్కడ టికెట్ల ధరలను తగ్గించాలని, లేనిపోతే సేవలను నిలిపివేస్తామని తాలిబన్లు ఇటీవల పీ.ఐ.ఏ తోపాటు స్థానిక విమానయాన సంస్థ ‘కామ్ ఎయిర్’ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పీ.ఐ.ఏ లో కాబుల్ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్ ధర 2,500 డాలర్ల వరకు ఉంటుంది. అంతకుమునుపు కేవలం 120 నుండి 150 డాలర్ల మధ్యే ఉండేది. కానీ ఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత ఇక్కడి నుంచి రెగ్యులర్‌గా సర్వీసులు నడుపుతున్న ఏకైక అంతర్జాతీయ విమాన సంస్థ ఇదే. ప్రస్తుతం పీ.ఐ.ఏ కాబుల్‌కు ఛార్టర్డ్ విమానాలు నడుపుతోంది. తాజాగా సర్వీసుల నిలిపివేతపై స్పందిస్తూ ‘మానవతా దృక్పథంతో అఫ్గాన్‌కు విమానాలు నడుపుతున్నాం. బీమా సంస్థలు కాబుల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున, బీమా ప్రీమియం ధరలు భారీగా ఉన్నాయి. ఈ ప్రభావం టికెట్లపై పడుతోంది’ అని వివరించడం జరిగింది. మరోవైప...