Posts

Showing posts with the label ap news

శ్రీబాగ్ ఒడంబడిక అమలు | SRI BAGH PACT FOR IMPLEMENTATION

  శ్రీబాగ్ ఒడంబడిక శ్రీబాగ్ ఒడంబడిక అమలులో పాలకుల వైఫల్యాలకు నిరసనగా నవంబర్ 16 2021 న నిర్వహిస్తున్న రాయలసీమ సత్యాగ్రహం విజయవంతం చేయండి. వేదిక :-  గాంధీ చౌక్, నంద్యాల మరియు రాయలసీమలోని వివిధ రెవిన్యూ కేంద్రాలలో తేది,సమయం :-   నవంబర్ 16, 2021 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు నవంబర్ 16 నే రాయలసీమ సత్యగ్రహం ఎందుకు ? రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక నవంబర్ 16, 1937 జరిగింది. కానీ హక్కుల పత్రంలోని ఏ అంశాలను కూడా పాలకులు అమలు పరచలేదు.అందుకే రాయలసీమ హక్కుల పత్రంలోని అంశాలను అమలు చేయమని శ్రీబాగ్ ఒడంబడిక జరిగిన నవంబర్ 16న గత నాలుగు సంవత్సరాలుగా రాయలసీమ ప్రజా సంఘాలు సత్యాగ్రహం నిర్వహిస్తున్నాయి .  శ్రీ బాగ్ ఒడంబడిక ఎందుకు జరిగింది ? ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక  ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మొదలయ్యింది. ఈ ఉద్యమంలో తొలి విజయంగా తెలుగు ప్రాంతంలో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం అనుమతించింది. రాయలసీమలో ఏర్పాటు కావాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్టణం లో  ఏర్పాటు చేయడంతో రాయలసీమ ప్రజలకు కోస్తా న...

Rayalaseema Satyagraham | రాయలసీమ సత్యాగ్రహం

  రాయలసీమ సత్యాగ్రహం నవంబర్ 16, 2021 ------------------------------- రాయలసీమ అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుకై 2008 నుండి ప్రతి సంవత్సరం  రాయలసీమ‌ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున సత్యాగ్రహం నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం నిర్వహించాల్సిన సత్యాగ్రహం పై ప్రజా సంఘాల సలహాలను, సూచనలను ఆహ్వానిస్తు జులై 25, 2021 న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఉత్తరం వ్రాయడమైనది.  రాయలసీమ సత్యాగ్రహం -2021  రాయలసీమలోని జిల్లా కేంద్రాలు మరియు ప్రధాన రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలని సూచనలు ప్రధానంగా వచ్చాయి. రాయలసీమ సత్యాగ్రహం ఉదయం 10 గంటలనుండి సాయింత్రం 4 గంటల వరకు నిర్వహించాలని సూచనలు వచ్చాయి. అదే సందర్భంలో ఏదైనా ఒక రాయలసీమ కేంద్రంలో కేంద్రీకృతంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచనలు కూడా వచ్చాయి. కోవిడ్ -19 ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నందున కేంద్రీకృతంగా కాకుండా రాయలసీమ జిల్లాల్లో వివిధ కేంద్రాలలో  రాయలసీమ ప్రాజెక్టుల ప్రాధాన్యత, శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో రాజధాని/హైకోర్టు, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణకై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమంగా రాయలసీ...