Rayalaseema Satyagraham | రాయలసీమ సత్యాగ్రహం
రాయలసీమ సత్యాగ్రహం
నవంబర్ 16, 2021
-------------------------------
రాయలసీమ అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుకై 2008 నుండి ప్రతి సంవత్సరం రాయలసీమ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున సత్యాగ్రహం నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం నిర్వహించాల్సిన సత్యాగ్రహం పై ప్రజా సంఘాల సలహాలను, సూచనలను ఆహ్వానిస్తు జులై 25, 2021 న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఉత్తరం వ్రాయడమైనది.
రాయలసీమ సత్యాగ్రహం -2021 రాయలసీమలోని జిల్లా కేంద్రాలు మరియు ప్రధాన రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలని సూచనలు ప్రధానంగా వచ్చాయి. రాయలసీమ సత్యాగ్రహం ఉదయం 10 గంటలనుండి సాయింత్రం 4 గంటల వరకు నిర్వహించాలని సూచనలు వచ్చాయి. అదే సందర్భంలో ఏదైనా ఒక రాయలసీమ కేంద్రంలో కేంద్రీకృతంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచనలు కూడా వచ్చాయి.
కోవిడ్ -19 ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నందున కేంద్రీకృతంగా కాకుండా రాయలసీమ జిల్లాల్లో వివిధ కేంద్రాలలో రాయలసీమ ప్రాజెక్టుల ప్రాధాన్యత, శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో రాజధాని/హైకోర్టు, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణకై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమంగా రాయలసీమ సత్యాగ్రహం - 2021 నిర్వహించాలని నిర్ణయించడమైనది. శ్రీబాగ్ ఒడంబడిక అమలుతో రాయలసీమ అభివృద్ధికి తోడ్పడే లాగా అన్ని రాజకీయ పార్టీల సహకరించేలాగా కార్యాచరణను రాయలసీమ సత్యాగ్రహం - 2021 ద్వారా చేపట్టాలని నిర్ణయించడమైనది.
రాయలసీమ ప్రజా సంఘాలు తమ తమ ప్రాంతాల్లో రాయలసీమ సత్యాగ్రహం -16 నవంబర్ 2021 న వివిధ ప్రజాసంఘాల సమన్వయంతో నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి.
----------------------------
బొజ్జా దశరథ రామి రెడ్డి
*కన్వీనర్*
రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక
98480 40991
Comments
Post a Comment