ARKE | మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) | Akkiraju the top Maoist leader
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ "ఆర్కే" అనారోగ్యంతో కన్నుమూత.!!
2004 అక్టోబరు 15న అప్పటి సీ.ఎం.వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్కే నేతృత్వంలోనే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై రూ.50 లక్షల రివార్డును కూడ పోలీసుశాఖ ప్రకటించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో జరిగిన ఎదురు కాల్పుల్లో పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆర్కే దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆర్కే మృతి మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మారుమూల కుగ్రామం తుమృకోట. బడి పంతులు కుమారుడు తీవ్ర వాద ఉద్యమ రథసారథిగా ఎదిగాడు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు. అతనే అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే. హరగోపాల్ తండ్రి అక్కిరాజు సచ్చిదానందరావు స్వగ్రామం గుత్తికొండ. బీఏ, బీ.ఈ.డీ చదువుకున్న సచ్చిదానందరావు మాస్టారు పెద్ద కొడుకైన హరగోపాల్‌కు తండ్రి నుంచి అభివృద్దికోసం ఆరాటం, అవినీతిపై అసహ్యం పేదల ప్రగతికి పాటుపడాలన్న తపన అలవడ్డాయి. ఉన్నత పాఠశాల భవనం అద్దె చెల్లించేందుకు హెచ్.ఎం. ఆదేశాల మేరకు మిగిలిన విద్యార్థులతో కలిసి పత్తి, మిరప కోతలకు వెళ్లేవాడు. తల్లి సత్యవతి చొరవ చూపి బంగ్లాదేశ్ వరద బాధితులకు విరాళాలు పోగుజేసి పంపడంలో కూడా కుమారునిలో ఆదర్శభావాల పెంపునకు దోహదపడింది. మాచర్ల ఎస్‌కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, బీ.ఎస్సీ చదివేటప్పుడు రామకృష్ణ రాడికల్ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యారు. గ్రామంలో సింగరుట్ల పంతులు చెప్పే " నక్సల్బరీ " ఉద్యమ గాధలు, చారుమజుందార్, కానూ సన్యాల్ చరిత్ర, శ్రీకాకుళం పోరాటంపై ఆసక్తి కనబర్చేవాడు. మాచర్లలో ఉన్నప్పుడే హరగోపాల్‌పై పార్టీ హోల్ టైమర్ బాలయ్య ప్రభావం అధికంగా పడింది. సహచరులు కోలా రమణారెడ్డి, చంద్రశేఖర్, సింగరుట్ల పంతులు సాహచర్యం అతడిని ఉద్యమంలో స్థిరపడేలా చేశాయి.
అప్పట్లో మాచర్లలోని కాసుబ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాల రాడికల్ ఉద్యమానికి కేంద్ర స్థావరం అయింది. ప్రముఖ ఆర్టిస్టు గాయకుడు అయిన పార్టీ హోల్ టైమర్ బాలయ్య వందలాది మంది విద్యార్థులను ఉద్యమం వైపు ఆకర్షింపజేసేలా చేశాడు.
Comments
Post a Comment